చిరు సాంగ్ కి రాధతో కలిసి స్టెప్పులేసి "బ్రో" తేజ్
on Jul 25, 2023
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హిట్ పెయిర్ ఎవరు అంటే చాలు రాధా, చిరంజీవి అనే యిట్టె చెప్పేస్తారు ఆడియన్స్. వీళ్ళ డాన్స్ లో ఉండే గ్రేస్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా ఐనా సాంగ్ ఐనా హిట్ కొట్టాల్సిందే. ఐతే ఇప్పుడు "నీతోనే డాన్స్" షోలో రాధ, చిరు హిట్ సాంగ్ "అందం హిందోళం" సాంగ్ కి సాయి ధరమ్ తేజ్ తో కలిసి డాన్స్ చేశారు అందాల రాధా. ఇన్నేళ్ళైనా కూడా ఆమె డాన్స్ లో ఎంత మాత్రం ఆ హాట్ నెస్ తగ్గలేదు. ఇంకా చలాకీగా గంతులేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీక్ "నీతోనే డాన్స్" షో ప్రోమోలో ఈ బిట్ ని చూడొచ్చు. పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఫస్ట్ టైం ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న మూవీ "బ్రో".
ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కేతిక శర్మతో కలిసి తేజ్ ఈ షోకి వచ్చారు. వీళ్ళు వచ్చాక శ్రీముఖి "ఇంకెన్నాళ్లు సోలోగా ఉంటారు" అని తేజ్ ని అడిగేసరికి "జీవితాంతం" అని చెప్పారు.. దాంతో సదా "వెల్కమ్ తో ది క్లబ్ బ్రో" అని అనేసరికి "మీరు బ్రో అంటే వెళ్లవయ్యా వెళ్లు అంటాం మేం కూడా’ అని ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఇక ఈ షోలో హైలైట్ ఐన విషయం ఏమిటి అనే మెగాస్టార్ పాటకి రాధతో కలిసి డ్యాన్స్ చేశాడు తేజ్. ‘యముడికి మొగుడు’ మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఐన ‘అందం హిందోళం’ సాంగ్‌కి రాధ ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచారు. ‘ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.. చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయినా కానీ మీతో డ్యాన్స్ చేశాను’ అంటూ చాల ఎగ్జైట్ అయ్యాడు. ఇక ఈ నెక్స్ట్ వీక్ షో థీమ్ ఏంటంటే "టాలీవుడ్ మీట్స్ బాలీవుడ్ " అంశంతో రాబోతోంది.. ఇందులో టాలీవుడ్ సాంగ్స్ తో బాలీవుడ్ డాన్స్ ని కూడా కలిపికొట్టారు కంటెస్టెంట్స్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
